80 ల‌క్ష‌లు న‌ష్ట‌పోయిన గ‌వ‌ర్న‌మెంట్ కాంట్రాక్ట‌ర్‌.. 24 గంట‌ల్లోనే ప‌రిష్క‌రించిన పోలీసులు 

మ‌రో ఆన్‌లైన్ మోసం..   సైబ‌ర్ నేర‌గాళ్లు ఈసారి ఏకంగా 80 ల‌క్ష‌లు కొట్టేశారు. బాధితుడు ఓ గ‌వ‌ర్న‌మెంట్ కాంట్రాక్ట‌ర్‌. వెంట‌నే పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేశాడు.. వాళ్లు వెంటనే యాక్షన్‌లోకి దిగిపోయారు. 24 గంట‌ల్లోనే పోయిన సొమ్ము మొత్తం రిక‌వ‌రీ చేసేశారు.  ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని పూణేలో 10 రోజుల కింద‌ట జ‌రిగింది. 

ఎలా జ‌రిగింది?
పూణేకు చెందిన ఓ గ‌వ‌ర్న‌మెంట్ కాంట్రాక్ట‌ర్‌కు ఓ కంపెనీ ఉంది. ఆయ‌న త‌న అకౌంట్లో నుంచి ఏకంగా 80 ల‌క్ష‌లు ఎవ‌రో కొట్టేశార‌ని గ్ర‌హించాడు. వెంట‌నే పూణే పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేశాడు. వాళ్లు సైబ‌ర్ క్రైమ్‌కు కేసును అప్ప‌గించారు. 

ఎలా రిక‌వ‌రీ చేయ‌గ‌లిగారంటే..?
పోలీసులు ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే రంగంలోకి దిగిపోయారు. ఆ 80 ల‌క్ష‌లు ఎవ‌రి అకౌంట్‌లోకి వెళ్లిపోయాయో ఆరా తీశారు.  గ్లోబ్ ఇంపెక్స్ అనే కంపెనీ అకౌంట్‌లో ఆ 80 ల‌క్ష‌లు జ‌మయిన‌ట్లు గుర్తించారు. జైపూర్‌లోని దేనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఆ కంపెనీ అకౌంట్ ఉంది. వెంట‌నే దేనా బ్యాంక్ అధికారుల‌కు విష‌యం చెప్పారు.  ఆ అకౌంట్ ఫ్రీజ్ చేసి ఆ 80 ల‌క్ష‌లు తిరిగి కాంట్రాక్ట‌ర్‌కు ఇప్పించారు.  ఈ నేరానికి పాల్ప‌డింది ఎవ‌ర‌ని ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్నారు. 

పోలీసుల‌పై ప్ర‌శంస‌లు
మామూలు నేర‌గాళ్లు పారిపోవ‌డ‌మో ఇంకొక‌టో చేస్తూ దొరికే అవ‌కాశాలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. అదే సైబ‌ర్ క్రిమిన‌ల్స్ అయితే మ‌నం క్ష‌ణం ఆల‌స్యం చేసినా చేయిజారిపోతారు. ఆ అమౌంట్‌ను వెంట‌నే రెండు, మూడు అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసి డ్రా చేసేస్తే రిక‌వ‌రీ చాలా క‌ష్ట‌సాధ్య‌మ‌య్యేది. నేర‌గాడు అల‌ర్ట్ అయ్యేలోపే యాక్ష‌న్‌లోకి దిగి సొమ్ము పోకుండా కాపాడిన పూణే పోలీసుల‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు .

సైబ‌ర్ క్రైమ్‌ 80 ల‌క్ష‌లు న‌ష్ట‌పోయిన గ‌వ‌ర్న‌మెంట్ కాంట్రాక్ట‌ర్‌ Cyber Crime Contractor robbed for 80 lakhs Pune police Â